• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Sundarakanda: మిడిల్ ఏజ్ పెళ్లికాని ప్రసాద్‌ల కష్టాలు.. నవ్వులు పూయించిన నారా రోహిత్ ‘సుందరకాండ’

Sundarakanda: మిడిల్ ఏజ్ పెళ్లికాని ప్రసాద్‌ల కష్టాలు.. నవ్వులు పూయించిన నారా రోహిత్ 'సుందరకాండ'

Sandhya by Sandhya
August 12, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Sundarakanda: మిడిల్ ఏజ్ పెళ్లికాని ప్రసాద్‌ల కష్టాలు.. నవ్వులు పూయించిన నారా రోహిత్ ‘సుందరకాండ’
Spread the love

Table of Contents

Toggle
  • Sundarakanda: మిడిల్ ఏజ్ పెళ్లికాని ప్రసాద్‌ల కష్టాలు.. నవ్వులు పూయించిన నారా రోహిత్ ‘సుందరకాండ’
    • రెండు ప్రేమకథల మధ్య నవ్వుల ప్రయాణం
    • భారీ నాన్-థియేట్రికల్ బిజినెస్

Sundarakanda: మిడిల్ ఏజ్ పెళ్లికాని ప్రసాద్‌ల కష్టాలు.. నవ్వులు పూయించిన నారా రోహిత్ ‘సుందరకాండ’

 

Sundarakanda: యువ కథానాయకుడు నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. మధ్య వయస్సులో ఉన్న ఓ యువకుడి పెళ్లి కష్టాలను హాస్యభరితంగా చూపించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వినాయక చవితి కానుకగా ఈ నెల ఆగస్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రెండు ప్రేమకథల మధ్య నవ్వుల ప్రయాణం

‘సుందరకాండ’ ట్రైలర్ ప్రకారం, కథానాయకుడు తనకు కాబోయే జీవిత భాగస్వామిలో ఉండాల్సిన ఐదు లక్షణాల కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతని కాలేజీ ప్రేమకథ, ప్రస్తుత ప్రేమకథ మధ్య జరిగే సంఘర్షణను వినోదాత్మకంగా చూపించారు. నారా రోహిత్ కామెడీ టైమింగ్, సంభాషణలు బాగా అలరిస్తున్నాయి. నరేశ్, సత్య, వీటీవీ గణేశ్, అభినవ్ గోమటం వంటి ప్రముఖ హాస్యనటుల పాత్రలు కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

భారీ నాన్-థియేట్రికల్ బిజినెస్

‘సుందరకాండ’ సినిమా విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ హక్కులతో భారీ బిజినెస్ చేసిందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, శాటిలైట్ హక్కులను ‘స్టార్ మా’ సొంతం చేసుకుంది. తెలుగు డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ.9 కోట్లు కాగా, హిందీ డబ్బింగ్ హక్కులు రూ.3 కోట్లకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ఈ భారీ డీల్స్ సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకాన్ని సూచిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని హీరోయిన్లుగా నటించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది సుందరకాండ.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా ట్రైలర్ సైతం హిలేరియస్‌గా ఉంది. నారా రోహిత్ కామెడీ టైమింగ్, పంచులు అదిరిపోయాయి. ఈ మూవీలో సీనియర్ హీరో నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా… వాసుకి సైతం కీ రోల్ ప్లే చేస్తున్నారు. టాప్ కమెడియన్స్ నటిస్తుండడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

 


Spread the love
Tags: comedy entertainerNara Rohit movieNara Rohit SundarakandaOTT rightsSundarakanda trailerVinayaka Chavithiఓటీటీ హక్కులుకామెడీ ఎంటర్‌టైనర్నారా రోహిత్ సినిమానారా రోహిత్ సుందరకాండవినాయక చవితిసుందరకాండ ట్రైలర్
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.