రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఒక సభలో పాల్గొన్న అనంతరం గాంధీనగర్ కు వెళ్తుండగా అటుగా అదే రూట్ లో అంబులెన్స్ వస్తోంది. హై వే పై ప్రధాని మోదీ కాన్వాయ్ వెళ్తున్న సమయంలోనే ఆ మార్గంలో ఒక అంబులెన్స్ రావడంతో మోదీ కాన్వాయ్ లెఫ్ట్ కు తీసుకుని, నెమ్మదిగా వెళ్తూ, ఆ అంబులెన్స్ కు దారిచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.