Naresh Pavithra Marriage: ఒక్కటైన నరేష్ -పవిత్ర జోడీ ….. కొద్దిమంది సమక్షంలోనే మైసూర్లో పెళ్లి..??
గత కొంతకాలంగా సహజీవనం చేస్తూ, తరచూ వార్తల్లో నిలుస్తున్న తెలుగు సినీ జంట అయిన సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లు తాజాగా పెళ్లి పీటలు ఎక్కినట్లు తెలుస్తుంది.మైసూర్ లోని కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే కొంతకాలంగా వీరు సహాజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే కొత్త ఏడాది రోజున, తాము కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం, అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలని ఆమెను ముద్దు పెట్టుకుంటూ 2022 డిసెంబర్ 31 న వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే నరేష్ మూడో భార్య రమ్య తో ప్రస్తుతం విబేధాలు, గొడవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి మొదటినుండి నరేష్ పవిత్రల బంధాన్ని వ్యతిరేకస్తున్న మూడో భార్య రమ్య….నరేష్ పవిత్రల పెళ్లి వార్తల నేపథ్యంలో ఏం చేయబోతుంది అనేది.