Nature : ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రాణకోటి పదిలంగా ఉంటారు. ప్రకృతిని మనం ఎంత కాపాడుకుంటే రాబోయే భవిష్యత్ తరాలు అంత పచ్చగా ఉంటాయి. మనం ప్రకృతికి కీడు చేయాలి అని చూస్తే ప్రకృతి మానవాళి పైన ప్రళయతాండవం చేసి, రాబోయే తరాలపైన పగ తీర్చుకోవడం మాత్రం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వాతావరణం చాలా గందరగోళ స్థితిలో ఉంటుంది.
ఎప్పుడు ఎండలు, వానలు ఉంటాయో ఎవరు ఊహించలేని స్థితిలోకి వాతావరణం నెట్టివేయబడింది. అనుకోని అకాల వర్షాలు, ఉష్ణోగ్రతకు మించిన ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితికి ఒక విధంగా ప్రజలే కారణం. ప్రకృతిని సంరక్షించడంలో ప్రజలు ఓడిపోయారు అనీ ప్రస్తుతం వాతావరణం చూస్తే మనకు అర్థమవుతుంది.
ఎందుకంటే చెరువులు ఉండవలసిన స్థలాల్లో ఇళ్లను కడుతున్నాము. అడవుల్లో ఉండవలసిన జంతువులు మనుషుల మధ్య రహదారుల పైన ఉంటున్నాయి. మనం అడవిని ఎంత దుర్వినియోగం చేస్తున్నామో.. ఆ ప్రభావం మొత్తం మానవాళి పైన పడుతుంది అనడం సమంజసం. అయితే అతి ఎండలు కానీ, అనుకోని అకాల వర్షాలు కానీ, ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు అంచనాల ప్రకారం
ప్రకృతి ఈ తీరు వల్ల ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అవ్వడమే కాక, చాలామంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని తేల్చింది. కార్బన్ ఉద్గారాల పరిణామ శాతం దేశంలో పెరిగిందని తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ నిర్మాణాలు, అడవుల నరికివేత, నీటి రవాణా, వైమానిక రవాణాలు, లోహ ఉత్పత్తుల లాంటి కార్బన్ ఉద్గారాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం.
విపరీతంగా గనులు, విద్యుత్తు, క్వారీ, గ్యాస్ రవాణా లాంటి కర్బన ఉద్గారాలా శాతం పెరగడం వల్ల, వచ్చే ఐదేళ్లలో సగటు ఉష్ణోగ్రతలు భారీగా పెరగడమే కాక.. గ్రీన్ హౌస్ గ్యాస్ ,ఫస్ ఫిక్ మహాసముద్రంలో ఎల్వినోల కారణంగా ఎండల తీవ్రత కూడా పెరగబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023 నుండి 2027 మధ్యకాలంలో సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటుందని వాళ్ళు తెలుపుతున్నారు.
రాబోయే ఐదేళ్లలో ఏదో ఒకసారి గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం ఖచ్చితమని హెచ్చరిస్తున్న నిపుణులు.. భారత ఆర్థిక వ్యవస్థ పై ఈ వాతావరణ మార్పుల ప్రభావం అధికం అని తెలుపుతూ.. 2030 నాటికి 4.5% జిడిపికి ముప్పు వాటిల్లడమే కాకా.. 3.4కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండలు, వర్షాలు ఈ రెండిట్లో ఏ ఒక్కటి పెరిగినా దానిపై ఆధారపడే పంటలు, ఇండస్ట్రీలు అన్నిటికీ ముప్పే అని చెప్తున్నారు.
.