నయనతార తల్లైన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి జరిగి 4 నెలలు కూడా పూర్తి కాకుండానే తాము ఇద్దరం కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు.
నయనతార ఈ మధ్య కూడా మీడియా కంట పడటం, అప్పుడు ఏమాత్రం గర్భంతో ఉన్న ఛాయలు కనిపించకపోవడంతో ఆమె సరోగసి ద్వారానే బిడ్డను కానీ ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.అయితే ఎవరు ఊహించిన విధంగా నయనతార విగ్నేష్ శివన్ ఈ సరోగసి ప్రాసెస్ తిప్పల నుంచి తప్పించుకోవడానికి పక్క ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.
సరోగసి ప్రాసెస్ బ్యాన్ అయింది ఇండియాలో అయితే వీళ్ళు సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసుకుంది దుబాయ్ లో అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. నయనతార ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటుంది. ఆమె ద్వారానే వాళ్ళు సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసినట్లు తెలుస్తుంది.
దుబాయ్ లో సరోగసి ప్రాసెస్ లీగల్.. సో ఒకవేళ అదే ప్రూవ్ అయితే నయనతార విఘ్నేశ్ శివన్ ల పిల్లలు దుబాయ్ సిటిజెన్స్ కిందకి వస్తారు. వాళ్ళ పిల్లలు పుట్టింది దుబాయిలో ఈ కారణంగా నయనతార విగ్నేష్ ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే మొన్న విగ్నేష్ కూడా పోస్ట్ చేస్తూ సరైన సమయంలో అన్నీ మీకే తెలుస్తాయి అని చెప్పుకొచ్చాడు. మరి చూడాలి ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే తమిళనాడు ప్రభుత్వం వారిని ఏమీ చేయలేదు.