నటుడు, దర్శకుడు విగ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లాడిన నయన్.. పెళ్లి జరిగి 4 నెలలు కూడా పూర్తి కాకముందే మగ కవల పిల్లలంటూ అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. ఆడియన్స్ పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెప్పినప్పటికీ.. ఈ కవల పిల్లల మ్యాటర్ వెనుక సీక్రెట్స్ ఏంటి అనే కోణంలో చర్చించుకున్నారు.
దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం మెడికల్ అడిషినల్ డైరెక్టర్ సారథ్యంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది.ఈ కమిటీ వద్ద నయనతార తన సరోగసీ విధానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించినట్టు తెలిసింది.
ముఖ్యంగా.. తాము ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లుగా ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం. అలాగే గత డిసెంబరులో అద్దెగర్భం కోసం రిజిస్టర్ చేసుకుని ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు.
సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్ళు పూర్తి కావాల్సివుంది. భార్య వయస్సు 25 నుంచి 50 యేళ్ళలోపు, భర్త వయస్సు 26 నుంచి 55 యేళ్ళలోపు ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. నయనతార ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని విచారణ కమిటీకి ఆధారాలు సమర్పించినట్టు సమాచారం.