ఇటీవల కన్నుమూసిన మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి సతీమణి అహల్య (68) అనారోగ్యంతో మృతి చెందారు.
నాయిని నరసింహారెడ్డి తో పాటు ఆమెకు కరోనా సోకింది. అయితే ఆ తర్వాత అహల్యకు నెగెటివ్ వచ్చిన ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ సోకడంతో జూబ్లీహిల్స్ లో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఈరోజు మృతి చెందారు. నాయిని నరసింహారెడ్డి మృతి చెందిన సమయంలో ఆఖరి చూపులకు అహల్యను కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఐదురోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో నాయిని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.