Ndendla Manoher – YCP : మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలను వైసీపీ నాశనం చేస్తోందని, వైసీపీ విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీలు, విధానాలు, అన్యాయాలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని..
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేశారన్నారు. వారాహి విజయయాత్రకు ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. ఇదే ఉత్సాహంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు. బటన్ నొక్కామని గొప్పగా చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి మోసాలు, మాయలు మనమే ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడేవారు కనబడని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి అంశంలో ప్రజల పక్షాన నిలబడుతూ. ముందుకు వెళ్తున్నారు. ఇతర పార్టీలకు భిన్నంగా అవకాశవాద రాజకీయాలకు దూరంగా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తున్నారు అని స్పష్టం చేశారు.
గత ఐదేళ్లుగా ఒక అజెండా ప్రకారం పవన్ కళ్యాణ్ గారి మీద రకరకాల దుష్ప్రదారాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి ఆలోచనలు చేయడం దుర్మార్గం. గత ఎన్నికల్లో ప్రజలు నిండు మనసుతో ఆలోచించి వైసీపీకి 151 సీట్లతో భారీ మెజారిటీ కట్టబెట్టిన సమయంలో బాధ్యతగల రాజకీయ పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామన్న సందేశాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చారు.
జనసేన పార్టీ ఎన్నికల కోసం వచ్చిన పార్టీ కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వచ్చిన పార్టీ, నిరంతరం ప్రజలకు మెరుగైన పరిపాలన అందేలా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తాం. అందులో భాగంగా విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం బలంగా నిలబడి ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. ప్రభుత్వంలో మార్పు వచ్చేలా అన్ని వేదికల మీద మాట్లాడాం. తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టాం. రైతుల పక్షాన నిలబడ్డాం అని నాదెండ్ల వెల్లడించారు.