Netflix Top 10 Indian Movies: నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న టాప్-10 ఇండియన్ సినిమాలు..!
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు భారతీయ సినిమాలకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన తర్వాత, నేరుగా డిజిటల్ మాధ్యమాల్లోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తమ ప్లాట్ఫామ్లో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, పీరియడ్ డ్రామా వంటి విభిన్న జానర్ల చిత్రాలు ఉండటం విశేషం.
టాప్ 10లో సత్తా చాటిన చిత్రాలు ఇవే..
1. RRR (హిందీ) – 43.65 మిలియన్ వ్యూస్..
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చారిత్రక యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చిత్రంగా నిలిచింది.
2. జవాన్ – 31.90 మిలియన్ వ్యూస్..
షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసి, అట్లీ దర్శకత్వం వహించిన ఈ హై-ఎనర్జీ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో విజయం సాధించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనూ భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

3. గంగూబాయి కతియావాడి – 29.64 మిలియన్ వ్యూస్..
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించారు. ఆలియా నటనకు ప్రశంసలు దక్కాయి.
4. లాపతా లేడీస్ – 29.50 మిలియన్ వ్యూస్..
కిరణ్ రావు దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ-డ్రామా, రైలు ప్రయాణంలో అనుకోకుండా మారిన ఇద్దరు యువ వధువుల కథను వినోదాత్మకంగా చూపింది.
5. యానిమల్ – 29.20 మిలియన్ వ్యూస్..
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న క్లిష్టమైన సంబంధాన్ని విశ్లేషిస్తుంది.

6. క్రూ – 27.2 మిలియన్ వ్యూస్..
టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ నటించిన ఈ కామెడీ చిత్రం హాస్యం, గ్లామర్, క్రైమ్ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
7. మహారాజ – 27.10 మిలియన్ వ్యూస్..
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’ ఒక భావోద్వేగ థ్రిల్లర్.
8. ఫైటర్ – 26.30 మిలియన్ వ్యూస్..
హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటించిన ఈ దేశభక్తి యాక్షన్ చిత్రం, డ్రామా, రొమాన్స్, యాక్షన్లను సమతుల్యం చేసింది.

9. లక్కీ భాస్కర్ – 26.30 మిలియన్ వ్యూస్..
దుల్కర్ సల్మాన్ నటించిన ఈ ఫైనాన్షియల్ థ్రిల్లర్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
10. సైతాన్ – 24 మిలియన్ వ్యూస్..
అజయ్ దేవగన్, ఆర్. మాధవన్ నటించిన ఈ హారర్ థ్రిల్లర్, అతీంద్రియ అంశాలను నిజమైన కుటుంబ భావోద్వేగాలతో మిళితం చేసింది.
ఈ జాబితా భారతీయ సినీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ అందిస్తున్న విభిన్నమైన వినోదాన్ని స్పష్టం చేస్తుంది. విభిన్న జానర్లు, భాషలకు చెందిన చిత్రాలు ఈ ప్లాట్ఫామ్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
