కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కి కరోనా సోకింది. ఇప్పుడు కరోనా సోకడం సర్వసాధారణం విషయం. కానీ, గతంలో కరోనా విషయంలో ఆయన చేసిన వాక్యలను గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ అయనేమన్నారు? ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ కంపెనీ తయారు చేసిన పాపడ్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని,తద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయనకు కరోనా సోకిందని తెలియగానే అప్పడం తింటే కరోనా తగ్గిపోతుంది. ప్రతి రోజు వాటిని తిని కరోనా తగ్గించుకోండి అంటూ బీజేపీ వ్యతిరేక వర్గం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
తనతో పాటు పెరిగిన సన్నిహితులను పరీక్షలు చేయించుకోవాల్సిన గా విజ్ఞప్తి చేశారు
