New Enemies for Revanth Reddy : తెలంగాణ ఏర్పడినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రెండు ఎలక్షన్స్ లలో గెలుపును చూడలేదు. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ఉందా, లేదా.. అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి మారిపోయింది. కానీ సంవత్సరకాలంగా పార్టీ ఒకేసారి పుంజుకొని ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పతాకాన్ని ఎగురవేసింది.
కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి ప్రధాన కారణం పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసుకోవడమే అని, ఆయన వల్ల పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మార్పుకు దారి తీసిందని అందరూ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఎల్లో మీడియా రేవంత్ రెడ్డి పైన కొత్త ప్రచారాన్ని తీసుకువచ్చింది.
తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇటు ఆంధ్రాలో చంద్రబాబుకి సహాయం చేస్తాడని, అదే రకంగా సహాయ సహకారాలు చంద్రబాబు నుండి కూడా అందుతాయని ఎల్లో మీడియా కొత్త కథనాన్ని లేవనెత్తింది. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి పైకి అందరి అనుమానం దొర్లింది. కొత్త కొత్త అనుమానాలను ఎల్లో మీడియా సృష్టించడం రేవంత్ రెడ్డికి నష్టాన్ని కలగజేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి సొంత పార్టీలోనే తనకు కొత్తగా శత్రువులు తయారవడం గమనార్హం. ఇక అసలు కథనంలోకి వెళ్తే.. ప్రస్తుతం సీఎం ఎవరు అంటూ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆసక్తికర చర్చ జరుగుతుంది. అందరూ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ పార్టీలో సీరియల్ నేతలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని సీఎంగా ఎలా చేస్తారని వ్యతిరేకత కూడా వస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ వ్యతిరేకత ఇలాగే కొనసాగితే ఓటింగ్ సిస్టం పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవైపు పార్టీ అధిష్టానము నిర్ణయం తీసుకోక ముందే, మరోవైపు రేవంత్ సీఎం అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారం కూడా రేవంత్ కొంపముంచేలాగా కనిపిస్తుంది. ఎవరు సీఎం అవుతారని విషయం పట్ల ఆసక్తి రేపుతుంది.
