New Rs.75 Coin : ఒకవైపు 2000 రూపాయల నోట్ల రద్దు విషయాన్ని ప్రజలు మర్చిపోకముందే, మరొక కొత్త ఆశ్చర్యకరమైన విషయంతో కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చింది. దేశంలోకి కొత్తగా రూ. 75 విలువ చేసే నాణం అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఆదివారం నుండి ఈ నాణాన్ని ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నాణం వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే..
ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని ఆదివారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు అయితే ఈ నేపథ్యంలో పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవ గుర్తుగా ఈ కొత్త నాణాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి అధికారిక గెజిట్ ను ఆర్థిక వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ కొత్త నాణం బరువు 35 గ్రాముల పైచిలుకే ఉంటుంది అని వెల్లడించారు.

అయితే ఈ నాణానికి ఒకవైపు అశోక చక్రం, సింహం ఉండగా, మధ్యలో దేవనాగరి లిపిలో భారతదేశం పేరు, ఇంగ్లీషులో ఇండియా అనే పదాలను వాడారు. ఈ నాణానికి మారక విలువగా 75 అంకె ఉండగా, మరోవైపు నూతన పార్లమెంటు భవనం ప్రాంగణం యొక్క ప్రతిమతో పాటు, దిగువన 2023 అంకెలు ముద్రించారు. దేశానికి స్వతంత్రం సిద్ధించిన ప్రతికగా ఈ నాణం నిలుస్తుందని ప్రధాని మోడీ వెల్లడించారు.
