Niharika : మెగా డాటర్ నిహారిక పెళ్లి దగ్గర నుంచి మొదలుపెడితే విడాకుల వరకు తను సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం జరిగి తర్వాత విడాకులు అయిన విషయం కూడా తెలిసిందే. విడాకుల తర్వాత నిహారిక ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు టూర్స్ అంటూ తెగ ఎంజాయ్ చేసేస్తుంది. రీసెంట్ గా నిహారిక ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఒకవైపు వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన షాపింగ్ వీడియోలు వైరల్ అవుతుంటే.. మరోవైపు నిహారికకు రెండో పెళ్లి అంటూ ఒక వార్త నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది. వరుణ్ తేజ్ పెళ్లిలోనే నిహారిక కూడా మంచి సంబంధం చూశారని, రెండో పెళ్లి చేయబోతున్నారని వార్త ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇక వరుడు విషయాని కొస్తే నాగబాబు ఫ్రెండ్ కొడుకు అని తెలుస్తుంది.

పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఫ్యామిలీని ఎంచుకున్నట్లు సమాచారం. నాగబాబు ఫ్రెండ్ పెద్ద బిజినెస్ మాన్ అనీ అతని కొడుకుని నిహారికకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారనీ వినికిడి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం అనేది ఆ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు స్పందిస్తే కానీ తెలియదు.
