NTR Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ కోసం భారీ ఓటీటీ డీల్.. ఇంతకీ ఏ ప్లాట్‌ఫాంలోనో తెలుసా?
NTR Neel: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్టు – ప్రస్తుతం ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) అనే పేరుతో చలనచిత్ర వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన ఓటీటీ ఒప్పందం ఇప్పుడు సినీ లవర్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
సినిమా థియేట్రికల్ విడుదల తర్వాత ఓటీటీలోకి ఎప్పుడు రావాలనే అంశంపై (థియేట్రికల్ విండో పీరియడ్) సినీ పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మెజారిటీ దక్షిణాది చిత్రాలు నాలుగు వారాల విండోను పాటిస్తుంటే, బాలీవుడ్‌లో కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఎనిమిది వారాల విండోను అమలు చేయడానికి ప్రయత్నించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, ‘డ్రాగన్’ (NTR – Neel) చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలకమైన ఓటీటీ ప్లాన్‌ను సిద్ధం చేశారనే వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ‘డ్రాగన్’ మేకర్స్ ఎనిమిది వారాల సుదీర్ఘ థియేట్రికల్ విండో పీరియడ్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంటే, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. మేకర్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)కు భారీ మొత్తానికి విక్రయించినట్లు ఇండస్ట్రీ టాక్.
నిర్మాతలు ఈ సుదీర్ఘ విండో పీరియడ్‌ను నిర్ణయించడానికి వెనుక బలమైన కారణం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో సినిమాను మరింత ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందాన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. హిందీ మార్కెట్‌లో సినిమా ప్రదర్శనను పెంచుకోవడానికి, నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్ సాయంతో మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువ కావడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ కూడా ఇదే పద్ధతిలో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం గమనార్హం.
