NTR Neel: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడిందా? ప్రశాంత్ నీల్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్?
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ సినిమాపై సినీ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం, తమ కెరీర్‌లో అత్యంత కీలకం కానుందని అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరూ భావిస్తున్నారు. అయితే, ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనూహ్యమైన రూమర్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తున్నాయి.
సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్న గుసగుసల ప్రకారం, ‘డ్రాగన్’ చిత్రం షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడిందని తెలుస్తోంది. దీనికి కారణం – హీరో ఎన్టీఆర్‌కు, దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు మధ్య సృజనాత్మక విభేదాలు తలెత్తడమేనని ప్రచారం జరుగుతోంది.
మొదటి షెడ్యూల్‌లో వచ్చిన అవుట్‌పుట్‌పై ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదని, అందులోని కొన్ని కీలక సన్నివేశాలు, కథనంలో మార్పులు చేయాలని ఆయన సూచించడంతో దర్శకుడు, హీరో మధ్య స్వల్పంగా అభిప్రాయభేదాలు తలెత్తాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రాజెక్ట్ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టాక్ నడుస్తోంది.
రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఎన్టీఆర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గతంలో ‘వార్ 2’ విషయంలో అభిమానులు కొంత నిరాశ చెందడంతో, ఇప్పుడు అందరి దృష్టి ‘డ్రాగన్’పైనే ఉంది. ఈ తరుణంలో రూమర్స్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. షూటింగ్ నిలిచిందా, లేక ఇది కేవలం ప్రాజెక్ట్‌లో మెరుగులు దిద్దేందుకు తీసుకున్న చిన్న విరామమా అనే దానిపై చిత్ర బృందం నుంచి స్పష్టత వస్తేనే ఈ గాసిప్‌లకు తెరపడనుంది.
