OG Movie: ఓజీ మేనియా.. ప్రీమియర్స్‌తోనే ఓవర్‌సీస్‌లో రికార్డుల సునామీ!
OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల, సినీ ప్రియుల ఎదురుచూపులకు తెరదించుతూ, సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ చిత్రం థియేటర్లలోకి అడుగుపెట్టింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాసి, టాలీవుడ్‌లో కొత్త చరిత్రకు నాంది పలికింది. ముఖ్యంగా ఓవర్‌సీస్ మార్కెట్‌లో ‘ఓజీ’ సృష్టించిన ప్రభంజనం అసాధారణమైనది.
సినిమా విడుదలకి ముందే నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ చివరి నిమిషంలో తమ ప్రదర్శనలను రద్దు చేయగా, మరొక నిర్మాణ సంస్థ వాటి బాధ్యతను తీసుకుంది. ఈ పరిణామాలు సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ, ఆ ఊహలన్నింటినీ పటాపంచలు చేస్తూ, ‘ఓజీ’ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని నమోదు చేసింది.
తాజాగా, ఓవర్‌సీస్ పంపిణీ సంస్థ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ‘ఓజీ’ నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారానే $3 మిలియన్ల (దాదాపు ₹26 కోట్లు) మైలురాయిని అధిగమించింది. ఇది టాలీవుడ్‌లో ఒక సంచలనం. ఇప్పటివరకు ఏ తెలుగు స్టార్ హీరో సినిమా ప్రీమియర్స్‌లోనూ ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదని, కేవలం ప్రీమియర్స్ కలెక్షన్లతోనే $3 మిలియన్లు సాధించడం ఇదే మొదటిసారి అని పంపిణీదారులు వెల్లడించారు. ఈ విజయం భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచమంతా ‘ఓజీ’ పేరు మారుమోగిపోతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అమలాపురం నుంచి అమెరికా వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ ఓజీ ’ పేరు మార్మోగిపోతోంది. ఫ్యాన్స్ నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ సినిమా రిలీజ్‌ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రిలీజ్‌కి ముందు రోజే ప్రీమియర్ షోలు వేయగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల స్కీన్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. నైజాంలో అయితే గతంలో ఏ చిత్రానికి లేని విధంగా ఏకంగా 366 షోలు పడ్డాయంటేనే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.