OG: ‘ఓజీ’ జపనీస్ మ్యూజిక్ బీట్.. క్రేజీ అప్డేట్ పంచుకున్న తమన్
OG: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ, సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఓజీ’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ కల్యాణ్ ‘ఓజస్ గంభీర’ అనే పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా సరికొత్త స్టైలిష్ అవతారంలో కనిపించనున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్, లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ చిత్రంలో హీరోయిన్గా యువ నటి ప్రియాంక మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. వీరితో పాటు శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో భాగమయ్యారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాడు. ఇప్పటికే విడుదలైన పవర్ఫుల్ బీజీఎం టీజర్‌తో అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఆయన విడుదల చేసిన జపనీస్ మ్యూజిక్ బీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్‌కు చెందిన సాంప్రదాయ వాయిద్యం “కోటో” సౌండ్‌తో కూడిన ఈ ప్రత్యేకమైన ట్రాక్ సినిమాకు ఓ ప్రత్యేకమైన మూడ్‌ను తీసుకురానుందని చెబుతున్నారు.
https://x.com/MusicThaman/status/1965126495107776689
తాజా సమాచారం ప్రకారం, లండన్‌లోని ఒక ప్రఖ్యాత స్టూడియోలో 117 మంది సంగీత కళాకారుల సమక్షంలో ‘ఓజీ’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ జరుగుతోంది. ఈ అప్డేట్తో #HungryCheetah హ్యాష్‌ట్యాగ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పవన్ కల్యాణ్ మాస్ యాక్షన్, సుజీత్ స్టైలిష్ టేకింగ్, తమన్ మ్యూజిక్ కలయికతో సినిమా ప్రేక్షకులకు పండుగలా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ‘ఓజీ’ విడుదలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో బాక్సాఫీస్‌పై పవన్ కల్యాణ్ తన మార్క్‌ను మరోసారి చూపించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.