OG Team Sent Biryani to Pawan Fan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) గురించి అందరికీ తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే రంజాన్ సందర్భంగా డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ పూట వినోదం ఆనందంతో పాటు ఆహారాన్ని ఎంజాయ్ చేయండంటూ ఆయన రాసుకొచ్చారు.

ఇందుకు స్పందించిన ఓ నెటిజెన్ ఓజీ నుండి బిర్యానీ ప్లాన్ చెయ్ అంటూ కామెంట్ చేశాడు. ఫ్యాన్ అడిగిందే తడవుగా DVV టీమ్ ఓకే డైరెక్ట్ గా మెసేజ్ చేసి నీ అడ్రస్ పంపించు.. హ్యాపీ ఈద్ టు యూ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో పొంగిపోయిన సదరు నెటిజన్ వెంటనే మెసేజ్ చేశాడు. దీంతో డీవీవీ టీమ్ వెంటనే ఆ అభిమాని అడ్రెస్ కు మెరిడియన్ మటన్ బిర్యానీ నెటిజెన్ ఇంటికి ఆర్డర్ పెట్టారు.
దీంతో ఈ హ్యాపీ మూమెంట్ ని నెటిజన్ సోషల్ మీడియా వేదికగా పిక్ తీసి షేర్ చేయగా ఇది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలావుండగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ కాగా ముంబైలో ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఓజి సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు మేకర్స్. ఇప్పటికే ఆమె సెట్స్ లో కూడా జాయిన్ అయ్యింది. థమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.
OG nundi Biryani plan chey
— Alone_Searcher _#OG (@alone_searcher) April 22, 2023