భారత్ జోడో యాత్ర లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు రాహుల్‌గాంధీ ఒక్కడు చాలని వేరే బి టీం లు అవసరం లేదని అన్నారు.
రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విరుచుకుపడ్డారు, కాంగ్రెస్‌ను బలహీనపరచడానికి రాహుల్ గాంధీ “చాలు” అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బిజెపికి ‘బి-టీమ్’గా వ్యవహరిస్తోందని మరియు కాంగ్రెస్‌ను బలహీనపరుస్తోందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.
‘కాంగ్రెస్‌ను బలహీనపరచాల్సిన అవసరం నాకు ఉందా? రాహుల్ గాంధీ సరిపోడా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న కి కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. ‘ఆప్’ కాంగ్రెస్‌ను బలహీనపరుస్తోందని, బిజెపికి ‘బి-టీమ్’గా పనిచేస్తోందని రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఈ విషయంలో మీ స్పందన ఏంటని ఒక రిపోర్టర్ అడిగారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారు
అంతవరకూ రాహుల్ పై విరుచుకు పడ్డ కేజ్రీవాల్, కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’పై మాట్లాడుతూ, “వారు ప్రయత్నం వారు చేయనివ్వండి. అందరూ మంచి పని చేయాలి. శుభాకాంక్షలు” అని అన్నారు. కేంద్రంలో ఆప్ అధికారంలోకి వచ్చి ప్రధాని అయితే ఇలాంటివి జరుగుతాయా అని అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.. అందరూ కలిసి వచ్చి నిర్ణయం తీసుకుని ఆప్ కి అధికారం ఇస్తే
విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తాం, పౌరులకు ఉచితంగా మంచి ఆరోగ్య సేవలు అందిస్తాం, దేశంలోని ప్రతి యువకుడికి ఉద్యోగాలు కల్పిస్తాం , ఐదేళ్లలో భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మార్చగలమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
AAP లక్ష్యం గుజరాత్ మరియు హిమాచల్
ప్రస్తుతం ఆప్ లక్ష్యం మరికొద్ది నెలల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో నిరంతరం పర్యటిస్తూ అక్కడ ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నారు. హిమాచల్‌లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సమావేశాలను ప్రారంభించింది.
