OTT Releases: ఈ వారం ఓటీటీలో ఏకంగా 35 సినిమాలు.. ఏవేవి, ఎక్కడెక్కడ చూడాలంటే?
OTT Releases: థియేటర్లలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ లాంటి భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తుండగా, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ వారం సరికొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17 వరకు వివిధ రకాల జోనర్లలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే కొన్ని ముఖ్యమైన చిత్రాలు, సిరీస్‌ల వివరాలు ఇక్కడ చూడండి.
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం రకరకాల సినిమాలు, సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఇందులో ముఖ్యంగా ‘సులివన్ క్రాసింగ్ సీజన్ 3’, ‘ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1’ వంటి ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామాలు అభిమానులను అలరించనున్నాయి. అలాగే, ‘ఫిక్స్‌డ్’ అనే యానిమేషన్ కామెడీ, ‘సారే జహాసే అచ్చా’ అనే హిందీ స్పై థ్రిల్లర్ తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు, పలు డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ అవుతాయి.
జియో హాట్‌స్టార్..
ఈ ప్లాట్‌ఫామ్‌లో అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ ‘డ్రాప్’, ఇంగ్లీష్ కామెడీ యానిమేషన్ ‘డాగ్ మ్యాన్’ వంటివి విడుదల కానున్నాయి. అలాగే, ‘ఏలియన్: ఎర్త్’ అనే హారర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్..
హిందీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ‘అంధేరా’ ఆగస్టు 14న, సూపర్ హీరో సినిమా ‘సూపర్‌మ్యాన్’ ఆగస్టు 15న స్ట్రీమింగ్ కానున్నాయి.
జీ5..
హిందీ యాక్షన్ థ్రిల్లర్ ‘టెహ్రాన్’ ఆగస్టు 14న, మలయాళ కోర్ట్ రూమ్ డ్రామా ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు డబ్బింగ్‌తో ఆగస్టు 15న విడుదల కానున్నాయి.
సన్ నెక్ట్స్..
తెలుగు మిస్టరీ థ్రిల్లర్ ‘గ్యాంబ్లర్స్’ ఆగస్టు 14న అందుబాటులోకి రానుంది.
ఈటీవీ విన్..
తెలుగు హారర్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ ఆగస్టు 14న స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం మొత్తం సుమారు 35కు పైగా సినిమాలు, సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. ఇందులో తెలుగు డబ్బింగ్ చిత్రాలు, ఇతర భాషల చిత్రాలు, వెబ్ సిరీస్‌లు కలిపి ఓటీటీ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి.