OTT Releases: ఈ వారం థియేటర్లలో ‘ఓజీ’ సందడి… ఓటీటీలలో మరెన్నో కొత్త సినిమాలు, సిరీస్‌లు
OTT Releases: ఈ వారం సినిమా ప్రియులకు పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్లలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘ఓజీ’ విడుదల కానుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దసరా పండుగను ముందుగానే తీసుకొస్తున్న ఈ చిత్రం, ఈ వారం తెలుగులో ఏకైక పెద్ద రిలీజ్‌గా నిలిచింది. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరగా, ప్రేక్షకులు, అభిమానులు సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో, హిందీలో ఆస్కార్ నామినేటెడ్ సినిమా ‘హౌమ్ బౌండ్’ కూడా థియేటర్లలోకి అడుగుపెట్టింది.
థియేటర్ల సందడితో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా వీక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ వారం వివిధ భాషల్లో అనేక కొత్త సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ తెరపైకి రానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో..
సెప్టెంబర్ 24న: ఇంగ్లిష్ సిరీస్ ‘హోటల్ కాస్టైరా’సెప్టెంబర్ 25న: ఇంగ్లిష్ సిరీస్ ‘కొకైనా క్వార్టర్ బ్యాక్’, హిందీ టాక్ షో ‘టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్’
సెప్టెంబర్ 26న: కన్నడ సినిమా ‘మాదేవా’
నెట్‌ఫ్లిక్స్..
సెప్టెంబర్ 26న: ‘ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా’, ఇంగ్లీష్ సిరీస్‌లు ‘ది గెస్ట్’, ‘అలైస్’, ‘హౌస్ ఆఫ్ గిన్నీస్’, ఇంగ్లీష్ సినిమా ‘మాంటిస్’
జియో హాట్‌స్టార్..
సెప్టెంబర్ 23న: తెలుగు సినిమా ‘సుందరకాండ’
సెప్టెంబర్ 24న: డాక్యుమెంటరీ ‘ది డెవిల్ ఈజ్ బిజీ’, ఇంగ్లీష్ సినిమా ‘మార్వెల్ జాంబియాస్’
సెప్టెంబర్ 26న: తెలుగులోకి డబ్ అయిన సినిమా ‘హృదయపూర్వం’
సెప్టెంబర్ 28న: ఇంగ్లీష్ చిత్రాలు ‘ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్’, ‘ఉమన్ ఇన్ ద యార్డ్’, ‘ద ఫ్రెండ్’, ‘డెత్ ఆఫ్ ఏ యూనికార్న్’
ఆహా..
‘జూనియర్’ సెప్టెంబర్ 22న స్ట్రీమింగ్ అవుతోంది
జీ5..
సెప్టెంబర్ 26న హిందీ సిరీస్ ‘జనావర్’
తెలుగు డబ్బింగ్ సినిమా ‘సుమతి వళవు’
సన్ నెక్స్ట్..
సెప్టెంబర్ 26న కన్నడ మూవీ ‘దూరతీర యానా’