• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Papa Buka: ఆస్కార్ ఎంట్రీ పొందిన పా. రంజిత్ మూవీ.. మన దేశం నుంచి కాదు, మరి ఎక్కడి నుంచంటే?

Papa Buka: ఆస్కార్ ఎంట్రీ పొందిన పా. రంజిత్ మూవీ.. మన దేశం నుంచి కాదు, మరి ఎక్కడి నుంచంటే?

Sandhya by Sandhya
August 28, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Papa Buka: ఆస్కార్ ఎంట్రీ పొందిన పా. రంజిత్ మూవీ.. మన దేశం నుంచి కాదు, మరి ఎక్కడి నుంచంటే?
Spread the love

Papa Buka: ఆస్కార్ ఎంట్రీ పొందిన పా. రంజిత్ మూవీ.. మన దేశం నుంచి కాదు, మరి ఎక్కడి నుంచంటే?

 

Papa Buka: కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత పా. రంజిత్ మరో అరుదైన ఘనత సాధించారు. ఆయన సహ నిర్మాతగా వ్యవహరించిన ‘పాపా బుకా’ (Papa Buka) చిత్రం ప్రతిష్టాత్మక 98వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ఎంట్రీ సాధించింది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పపువా న్యూ గినీ దేశం నుంచి అర్హత సాధించిన మొట్టమొదటి చిత్రంగా రికార్డు సృష్టించడం విశేషం.

‘పాపా బుకా’ చిత్రాన్ని పపువా న్యూ గినీ దేశానికి చెందిన నోయెలెన్ తౌలాతో కలిసి పా. రంజిత్, అక్షయ్ కుమార్ పరిజా, ప్రకాష్ బరే సంయుక్తంగా నిర్మించారు. మూడు జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ మలయాళ దర్శకుడు బిజుకుమార్ దమోదరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో ముఖ్యమైన అంశం. పీఎన్‌జీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ చారిత్రాత్మక చిత్రాన్ని భారతీయ సినీ బృందంతో కలిసి నిర్మించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఘనతపై పా. రంజిత్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ గర్వించదగిన క్షణమని, ‘పాపా బుకా’ కథను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లినందుకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా గురించి పపువా న్యూ గినీ ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ డాన్ నైల్స్ మాట్లాడుతూ, “ఇది పీఎన్‌జీ సినిమా చరిత్రలో ఒక చారిత్రాత్మక క్షణం. ‘పాపా బుకా’ మా కథలు, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆస్కార్ వేదిక ద్వారా ప్రపంచానికి మా చిత్రాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.

రెండో ప్రపంచ యుద్ధంలో పీఎన్‌జీలో పోరాడిన భారతీయ సైనికుల కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో పీఎన్‌జీ నటులతో పాటు భారతీయ నటులు రీతాభరి చక్రవర్తి, ప్రకాష్ బరే తదితరులు నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది.


Spread the love
Tags: Biju Kumar DamodaranOscars 2026Pa RanjithPa Ranjith moviesPapa BukaPapua New Guinea filmఆస్కార్ అవార్డులునీలం ప్రొడక్షన్స్పపువా న్యూ గినీపా రంజిత్పాపా బుకాబిజుకుమార్ దమోదరన్
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.