Palm Jaggery : ఈరోజుల్లో చాలామంది పంచదారకు బదులుగా తాటిబెల్లాన్ని వాడుతున్నారు. ఆరోగ్య సమస్యల రీత్యా పంచదార శరీరంలో చక్కెర స్థాయిని పెంచి చాలా అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్న నేపథ్యంలో చాలామంది తాటిబెల్లం ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.
అయితే ఈ తాటిబెల్లం వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి తాటిబెల్లం ఎలా తయారు చేస్తారో అని సందేహంగా ఉంటుంది. ఈ తాటి బెల్లాన్ని ప్రత్యేకంగా ఖర్జూర రసం నుంచి గాని లేదా తాటికాయలను కాల్చి కానీ ఈ బెల్లాన్ని తయారు చేస్తారు. దాంట్లో ఉండే సహజ చక్కెరలు దానికి తీపి రుచిని తెస్తాయి.

దీనిని ఉపయోగించడం వల్ల మధుమేహంతో బాధపడే వారికి ఆ సమస్య తొలగిపోతుంది. చాలామంది ఆరోగ్య సమస్యల వల్ల వైద్యుల సూచనల మేరకు కాఫీ, టీ లలో ఈ తాటిబెల్లాన్ని వాడుతున్నారు. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవు కంట్రోల్లో ఉంటాయి. తాటిబెల్లం స్త్రీల అనారోగ్య సమస్యలకు కూడా చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
స్త్రీలు ఎక్కువగా పిసిఒడి, పిసిఒఎస్, అధిక రక్తస్రావం సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు చక్కెరకు బదులుగా ఈ బెల్లం వాడితే మంచి ఉపయోగం ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారికి కూడా తొందరగా బరువు తగ్గడానికి తాటి బెల్లం చక్కటి పరిష్కారం.
తాటి బెల్లం వాడడం వల్ల శరీరంలో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి మెరుగుపడుతుంది వాస్తవానికి పూర్వం పిల్లలకు జలుబు చేసినప్పుడు ఔషధాలకు బదులుగా ఈ తాటి బెల్లాన్ని వాడే వారంట జలుబు దగ్గు నుంచి వెంటనే ఉపశమనం పొందటం ఇలాంటి తాటి బెల్లాన్ని ప్రతి ఒక్కరు వాడి మీ ఆరోగ్యాన్ని భద్రపరుచుకోండి.
