Panchayat Raj System : మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పంచాయతీలను కాపాడుకుందాం చర్చాగోష్ఠిలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గ్రామాలు గణతంత్రంగా వ్యవహరించగలగాలి. సొంత అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాదించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది… గ్రామ స్వరాజ్యం గురించి బాపూజీ మహాత్మా గాంధీ చెప్పిన ఈ మాటలకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయి. అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు.
సాధారణ అవసరాలు సంగతి పక్కనపెడితే… రోడ్డు, మంచినీటి సరఫరా వంటి అత్యంత కీలకమైన పనులు కూడా చేయలేక పంచాయతీలు కునారిల్లుతున్నాయని అన్నారు. ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్రం దారిమళ్లించడంతో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందని అన్నారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు దారి మళ్లిస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో గ్రామాల అభివృద్ధి తోంది.

పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీన పరిచారు. కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కొంతమంది శాసనసభ్యులతో కలిసి పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉన్న కేరళ రాష్ట్రంలో పర్యటించాం. అక్కడ ఒక్కొక్క సర్పంచ్ కు దాదాపు 34 శాఖలపై పూర్తి పట్టు ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థను కేరళ తరహాలో బలోపేతం చేయాలని అప్పట్లో ప్రయత్నాలు చేశాం.
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాలంటీర్లు అనే సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా బలహీనం చేస్తోంది. ఈ సమాంతర వ్యవస్థతో గ్రామ ప్రధమ పౌరుడైన సర్పంచు డమ్మీగా మారిపోతున్నాడు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. అధికారంలోకి రాగానే పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తాం అని నాదెండ్ల స్పష్టం చేసారు.
