Pawan Kalyan : తెలంగాణ మంత్రి హరీశ్ రావు-ఏపీ మంత్రుల మధ్య జరిగిన మాటల యుద్ధంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై, వైసీపీ మంత్రులు హద్దు దాటి విమర్శలు చేయడంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
‘పాలకులు వేరు.. ప్రజలు వేరు.’ ఇలాంటి వ్యాఖ్యలు నాయకులు చేయడం సిగ్గు చేటు అని..నాయకుల మధ్య వైరుధ్యాలకు ప్రజలకు సంబంధం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ నాయకులకు, ఏపీ మంత్రులకు కూడా వర్తిస్తాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే మంత్రి హరీశ్ రావు ఏ సందర్భంలో ఏపీపై మాట్లాడారో కానీ.. ఆ మాటలను ఆధారంగా తీసుకొని ఏపీ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి, వ్యక్తిగత విమర్శ చేయకుండా మొత్తం తెలంగాణ ప్రజలను తిట్టడం సరైన పద్ధతి కాదని, ఇది చాలా అవగాహన రాహిత్యమని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు.
‘ ఏపీ మంత్రుల తీరు పై.. సీఎం,ఆ పార్టీ సీనియర్ నాయకులు స్పందించాలి అని అంటూ..అయినా ఏపీ మంత్రులకు, నేతలకు తెలంగాణలో చాలా వ్యాపారాలున్నాయి. బొత్సా లాంటి సీనియర్ నాయకులు మొన్నటి వరకు తెలంగాణలో కేబుల్ బిజినెస్‌లు చేసారు.వ్యాపారాలకు తెలంగాణను
ఉపయోగించుకుంటూ తిరిగి మళ్లీ తెలంగాణపై, ప్రజలపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి, మీ వివాదాల్లోకి ప్రజలను లాగద్దు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీనేలా మాట్లాడిన వైసీపీ మంత్రులు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.