Pawan Kalyan – Augst 15 : భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా భారతదేశం మొత్తం జెండా పండుగ కార్యక్రమాల్లో నిండిపోయింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కూడా జెండాను ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకుంది. భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు.
పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకతను ఆనాటి పోరాటాలను నేటి పరిస్థితులను గురించి వివరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితోపాటు పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉన్నటువంటి నియోజకవర్గం లో కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు.
