Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి స్పెషల్ సర్ప్రైజ్.. పీకే ఫ్యాన్స్ గెట్ రెడీ
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ సంవత్సరం పుట్టినరోజున అదిరిపోయే ట్రీట్ దక్కనుంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రెండు భారీ చిత్రాల నుంచి కీలకమైన అప్డేట్స్ రానున్నాయని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా, సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ (OG – Original Gangster) సినిమా నుంచి అభిమానుల కోసం ప్రత్యేక వీడియో సాంగ్ విడుదల కానున్నట్లు సమాచారం.
హంగ్రీ చీతాను మించి..
గత సంవత్సరం పుట్టినరోజున విడుదలైన ‘హంగ్రీ చీతా’ గ్లింప్స్‌కు వచ్చిన అసాధారణ స్పందన తర్వాత, ఈసారి దానికి మించి విజువల్స్, తమన్ అందించిన మాస్ మ్యూజిక్‌తో కూడిన వీడియో సాంగ్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రత్యేక వీడియో సాంగ్‌లో పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, కొన్ని క్రేజీ గ్లింప్స్‌తో పాటు కథపై కూడా ఒక మిస్టరీ టచ్ ఇవ్వనున్నారు. ‘ఓజీ’ షూటింగ్ చివరి దశలో ఉందని, ఇంకో రెండు రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. వీడియో సాంగ్‌తో పాటు, సినిమా విడుదల తేదీకి సంబంధించిన కీలకమైన అప్డేట్ కూడా రావచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈసారి పండగలా బర్త్‌డే..
‘ఓజీ’తో పాటు, పవన్ కల్యాణ్ మరో భారీ ప్రాజెక్ట్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కూడా పుట్టినరోజు సందర్భంగా టీజర్ లేదా పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకేసారి రెండు చిత్రాల నుంచి అభిమానులకు బర్త్‌డే ట్రీట్స్ లభిస్తుండడంతో, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ పుట్టినరోజును పండుగలా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ అప్డేట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచడంతో, అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది.