Pawan Kalyan Contest from Kakinada? : ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల్లో వైసిపి ఒంటరిగానే పోటీలోకి దిగుతుండగా జనసేన టిడిపి మాత్రం కలిసి బరిలో తమ సత్తాను చాటానున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ఎప్పుడో మొదలుపెట్టారు. జనసేన గెలిచే అవకాశం ఉన్న ఒక్కో నియోజకవర్గాలపై
ఆయన ప్రత్యేక దృష్టిని సారించి, మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ కాకినాడలో బస చేసి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ వ్యవహారాలను సమీక్ష చేయబోతున్నారని ఒక సమాచారం. పవన్ కళ్యాణ్ ముందస్తు ఆలోచనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు. ఇప్పుడు ఆ సర్వేల ఆధారంగానే ఎంపికలను ఆయన చేపడుతున్నారు.
తన గెలుపుకు డోకా ఉండకూడదు అనే విషయంపై కూడా పవన్ దృష్టి సారించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈసారి తన గెలుపునకు ఎటువంటి అడ్డంకులు లేకుండా, జాగ్రత్తగా ఉండేలాగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇదివరకు గాజువాక, భీమవరం నియోజకవర్గం ఓటమి చవిచూడడంతో ఆ పరిస్థితి మరల రాకుండా పవన్ ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు.
అంతేకాదు జగన్ కు అత్యంత సన్నిహితుడు అయినటువంటి కాకినాడ సిటీ వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని పవన్ ఆ ప్లేస్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. గతంలో భాగంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
అందుకే ఇప్పుడు ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేసి తన సత్తా ఏంటో చాటుకోవాలని పవన్ ఉన్నారంట. కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలపై పడుతుందని జనసేన అధినేత ఆలోచించాడు. జనసేనకు ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలు వస్తాయని పవన్ భావిస్తున్నారు. దీంతో పాటు ద్వారంపూడి ని ఓడించడం అంటే దాదాపుగా జగన్ ఓడించడమే అని లెక్కల్లో పవన్ ఉన్నారని తెలుస్తుంది.