Pawan Kalyan: పవన్ కళ్యాణ్, లోకేష్ సినిమా ఫిక్స్.. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖరారు?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా, పవర్‌స్టార్‌గా పవన్ కళ్యాణ్ తన వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన సమయాన్ని గడుపుతున్నారు. క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, పెండింగ్‌లో ఉన్న సినిమా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఆయన చొరవ తీసుకుంటున్నారు, తద్వారా నిర్మాతలపై భారం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పవన్ కళ్యాణ్ మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు సినీ వర్గాల నుంచి బలమైన సమాచారం అందుతోంది.
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ చెప్పిన కథకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని వార్తలు వచ్చినా, అప్పట్లో రాజకీయాల కారణంగా చర్చలు విఫలమయ్యాయి. అయితే, తాజాగా లోకేశ్ చెప్పిన కథకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారని టాక్. ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్యంలో రూపొందుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ ఇటీవల విడుదలైన ‘ఓజీ’ సినిమాతో బంపర్ హిట్ అందుకుని ఫామ్‌లోకి వచ్చారు. ఈ విజయం ఆయనకు సినీ, రాజకీయ రంగాల్లో మరింత ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో భారీ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను 2026 అక్టోబర్ 27న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ కృషి అమోఘం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఆయన పోషించిన పాత్ర అత్యంత కీలకమైనది. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న తర్వాత పరిపాలనలోనూ తనదైన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
