Pawan kalyan in Mangalagiri : మంగళగిరిలో జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ వైసీపీ పాలన యొక్క తీరును ఎండగాట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం యొక్క అక్రమాల గురించి పనితీరు గురించి మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కు స్థిరత్వం ఇవ్వాలని బలమైన కారణంతోనే జనసేన పార్టీ పనిచేస్తుంది.
రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి అనేది ప్రాథమిక ఎజెండాగా ఎలా ఎదగాలన్నది నాయకులు పట్టించుకోలేదు. కేవలం వారి వ్యక్తిగత ఎదుగుదల తప్ప, ప్రజా క్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం మీద నిబద్ధతతో నిలబడి ఉంది. నేను ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినా, ఇక్కడ మాట్లాడినా విభజన తర్వాత రెండు రాష్ట్రాలు.
ఎలా అభివృద్ధి వైపు వెళ్లాలని అంశాలు, కేంద్రం అందించాల్సిన సాయం మీద మాట్లాడుతాను. మేం చెప్పే ప్రతి మాట రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని చెబుతున్నది. అర్ధశాస్త్రంలో పన్నులను ఎలా విధించాలనే అంశంపై నిపుణులు చెబుతూ ‘పూల మీద మకరందం తీసుకునే సీతాకోకచిలుకలా ప్రభుత్వం పన్నుల విషయంలో వ్యవహరించాలని తెలిపారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉంది . ప్రజలపై ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వేస్తూ, ఆ డబ్బుతో సంక్షేమం అంటే ఎలా..? అది ఎలా ప్రజలకు మేలు చేస్తుంది..?
ఓ పద్ధతి లేకుండా చేస్తున్న వైసీపీ పాలన వల్ల రాష్ట్రం పది అడుగులు వెనక్కు వెళుతున్నాం. ప్రజలు కులం, మతం, ప్రాంతం దాటి ఆలోచించకపోతే పూర్తిగా రాష్ట్ర ప్రజల ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ పాలనపరమైన ఇబ్బందులు అలాగే ఉన్నాయి. మన వ్యవస్థ ఇప్పటికి సర్దుబాటు కాలేదు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఎలాంటి అరమరికలు లేకుండా సాపిగా పాలన సాగించలేని స్థితిలో ఉండిపోయాం” అని పవన్ స్పష్టం చేశారు.