Pawan Kalyan : ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, రాజకీయాల్లో దూసుకెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈసారి ఏపీలో ఎలాగైనా జనసేన జెండా ఎగరవేయాలని నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది జనసేన. అయితే ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించడానికి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ టీ షర్ట్, ఖాకీ ప్యాంట్ తో పవన్ అదిరిపోయే లుక్ లో ఉన్నారు పవన్. ఇదిలా ఉండగా మార్పు మొదలైంది అంటూ జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈరోజు, రేపు పవన్ వివిధ సంఘాల నేతలతో సమావేశం అవుతారు. ఇక 14వ తేదీన నిర్వహించనున్న సభ కోసం, సభకు తరలివచ్చే శ్రేణులు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 10 కమిటీలను ఏర్పాటు చేశారు జనసేన నాయకులు. ఇటు తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు హాజరు కానుండడంతో అన్ని ఏర్పాట్లు చేశారు.