Pawan Kalyan – LT Polymers : జనసేన వారాహి యాత్రలో భాగంగా విశాఖ సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి అక్రమాలను బయటకు తీసుకొచ్చారు. ఒక్కో అక్రమాన్ని సాక్ష్యాదారాలతో సహా పవన్ కళ్యాణ్ బహిర్గతం చేస్తూ వస్తున్నారు. అక్రమ కబ్జాలు, దౌర్జన్యాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ అలాగే ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను కూడా పణంగా పెట్టే విధంగా విశాఖను విషతుల్యం చేసే ఘటనలను కూడా పవన్ కళ్యాణ్ బహిర్గతం చేశారు.
దాంట్లో భాగంగానే ఎల్టీ పాలిమర్స్ గురించి అయన ప్రస్తావించారు. ఎల్టీ పాలిమర్స్ ఘటనలో 1800 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. బాధిత 350 కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదు. వారికి ఉపాధి కల్పించలేదు. వైసీపీ నాయకులు బాధితులను మోసం చేసి పరిహారం కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటున్నారు. చాలామందికి పూర్తి స్థాయి పరిహారం ఇవ్వలేదు. ప్రమాద స్థలంలో రక్షిత మంచినీరు, ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అతీగతి లేదు.
ఎల్టీ పాలిమర్స్ ఘటన తర్వాత అలాంటివి చిన్నాపెద్దా కలిపి మరో ఏడు, ఎనిమిది ఘటనలు జరిగాయి. దీనిపై సిఫ్టీ ఆడిట్, గ్రీన్ ఆడిట్, పొల్యూషన్ ఆడిట్ ఇప్పటి వరకు జరగలేదు. దీనికోసం బాధితులు అధికారులను అడిగితే అధికారుల స్పందన బాగా లేదు. ఘటన ఎప్పుడో జరిగిపోయింది కదా, పరిహారం వచ్చింది కదా అని మాట్లాడటం దారుణం. మాట్లాడితే విశాఖను రాజధాని చేసేస్తున్నాం అని చెప్పే ముఖ్యమంత్రి గారు మొదట విశాఖపట్నం నగరాన్ని విషతుల్య రహిత నగరంగా చేయండి.
మళ్లీ ఎల్టీ పాలిమర్స్ లాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పిన ప్రభుత్వం దాని తర్వాత పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రను కాలుష్యంతో నింపేస్తున్నారు. ఈ నాటికి ఎన్టీ పాలిమర్స్ ఘటన మీద న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు..? ఎప్పుడు ఏ విష వాయువు కమ్మేస్తుందో, ఏం జరుగుతుందోనన్న భయంతో విశాఖ ప్రజలు బతుకుతున్నారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.