Pawan Kalyan – Mallavalli : మల్లవల్లి పారిశ్రామికవాడ రైతులతో జనసేన పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం మధ్యాహ్నం రైతులతో ముఖాముఖి చర్చించి, వారి తరఫున గళం విప్పిందేకు మల్లవల్లికి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఎదుట తమ బాధలు చెప్పుకున్నారు. మల్లవల్లి పారిశ్రామికవాడ పేరిట పరిశ్రమలు పెడతామంటూ గత ప్రభుత్వ హయాంలో భూములు తీసుకున్నారు..
తరతరాలుగా మాకు వస్తున్న భూములు త్యాగం చేశాం.. అప్పటి నుంచి పరిహారం ఇవ్వలేదు… ఉన్న జీవనాధారం పోయి వలసలు వెళ్లి బతుకుతున్నాం. అధికారులు, పాలకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి అలసిపోయాం. న్యాయం చేస్తామని చెప్పే వాళ్లే గాని మాకు న్యాయం చేసిన వారు లేరు. ఇక్కడ పనులు చేయాలంటే మాకు పరిహారం ఇచ్చి తీరాలని పోరాడుతున్నాం.. మాకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం పోరాడుతుంటే మాపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారు.
పొలంలో మొక్కలు వేసిన వారికి పరిహారం అంటున్నారు. కొందరికి ఇచ్చేస్తామంటారు గాని ఇవ్వరు.. పెళ్లిళ్ల సమయంలో ఆడ బిడ్డలకు స్త్రీ ధనం కింద ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు. మా బిడ్డల సంపాదాలు పోయాయి.. కృష్ణా జిల్లా, బావులపాడు మండలం, మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతుల గోడు ఇది. తమకు న్యాయంగా అందాల్సిన పరిహారం అందేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారిని వేడుకున్నారు. ఒక్కో బాధితుడు వారి బాధలు చెప్తుంటే వైయస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వారిని ఎంతలా దోచుకోవాలి నష్టం అంతలా చేసేసింది.
అభివృద్ధి పేరుతో అధికార ప్రభుత్వం అడ్డగోలుగా దోపిడీ చేస్తూ అమాయకులైన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆడబిడ్డల పేరు మీద ఇచ్చిన భూమిని కూడా కాజేయడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత దిగజారుడు చర్యలకు పాల్పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. వారి దీన గాధలు విని చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు చివరి ఎకరంకు పరిహారం అందే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వైసిపి ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంచుతామని రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.