OG Movie: ‘ఓజీ’ మేనియా.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్ రచ్చ.. పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్ వైరల్!
OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ వసూళ్లను సాధించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఇటీవలే ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా సంచలనం సృష్టిస్తోంది.
ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ పవన్ కల్యాణ్ అభిమానులకు మరింత కిక్కిచ్చేలా ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్‌ను తాజాగా యూట్యూబ్‌లో పంచుకుంది. ఈ సన్నీవేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ఈ సన్నీవేశం ‘ఓజీ’ చిత్రంలో అత్యంత హైలైట్‌గా నిలిచిన వాటిల్లో ఒకటి. ఇందులో ముఖ్యపాత్ర అయిన సత్య దాదా (ప్రకాశ్‌రాజ్)ను అంతమొందించడానికి విలన్ గ్యాంగ్ చుట్టుముట్టి బంధించి ఉంచుతుంది. సరిగ్గా అదే సమయంలో దాదాను కాపాడటానికి పవన్ కల్యాణ్ పోషించిన ఓజాస్ గంభీరా రంగంలోకి దిగుతాడు. ఉద్వేగభరితమైన నేపథ్య సంగీతం, పవర్ స్టార్ మాస్ స్వాగ్‌తో కూడిన ఈ ఎంట్రీ సీన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
థియేటర్లలో ఈ సీన్‌కు లభించిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చినప్పటికీ, ఈ ఒక్క దృశ్యాన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకంగా యూట్యూబ్‌లో విడుదల చేయడం ద్వారా పవన్ కల్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపితమైంది. ఈ ఎంట్రీ సీన్ కొద్ది సమయంలోనే లక్షల్లో వ్యూస్‌ని సాధిస్తూ వైరల్ అవుతోంది. ఈ సినిమా విజయంలో పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, ఆయన స్టైల్ ప్రధానాకర్షణగా నిలిచాయి. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, ఈ మాస్ ఎంట్రీని యూట్యూబ్‌లో చూసి ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
