OG Movie: ‘ఓజీ’ పవర్‌ఫుల్ సాంగ్.. ‘హంగ్రీ చీతా’ పూర్తి పాట విన్నారా?
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ప్రముఖ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానులను ఆకట్టుకోగా, తాజాగా సినిమాలోని ‘గన్స్ అండ్ రోజెస్’ పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఈ పాటకి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ పాటలోని “ఊచకోత.. చావుమోత” అనే పదాలు ఓజాస్ పాత్రలోని గంభీరతను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ర్యాప్ సాంగ్ ద్వారా ‘ఓజీ’ ప్రపంచంలోని ప్రమాదకరమైన శక్తులను మరియు వాటిని ఎదుర్కొనే హీరో పాత్ర స్వభావాన్ని పరిచయం చేశారు. గతంలో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లో హైలైట్ అయిన ‘హంగ్రీ చీతా’ అనే పదం ఈ పాటలోనిదే కావడం విశేషం.
ఈ చిత్రం ఒక పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ అనే పాట ద్వారా విలన్ పాత్రను పరిచయం చేయగా, ఇప్పుడు వచ్చిన ‘గన్స్ అండ్ రోజెస్’ పాట ద్వారా హీరో పాత్రలోని పవర్‌ఫుల్ కోణాన్ని చూపించారు. ఈ పాటకు అద్భుతమైన ర్యాప్ లిరిక్స్ ని రాశారు, మరియు హర్ష ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. ‘ఓజీ’ సినిమా విడుదల తర్వాత అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.