చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడో మైలు దగ్గర పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ ముగ్గురు అభిమానులు దుర్మరణం పాలయ్యారు మరొక నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గుండెలనిండా తన పట్ల అభిమానం నింపుకున్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జనసేన అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను. దూరమైన ఆ బిడ్డలను తీసుకురాలేను. కానీ.. ఆ తల్లిదండ్రులకు నేనే ఒక బిడ్డగా అండగా నిలుస్తానని ఆయన అన్నారు. అంతేకాక మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. మరో నలుగురు గాయపడిన కార్యకర్తలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్థానిక నాయకులను కోరారు.