Pawan Kalyan : నాదెండ్ల మనోహర్ గారు మన పార్టీ కోసం బలంగా నిలబడిన వ్యక్తి ఆయనపై తప్పుడు ప్రచారాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాం. అనీ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మనోహర్ గారు జనసేన పార్టీకి ఒక సోదరుడీలా వెన్నంటి నిలబడ్డారు. కానీ ఈ రోజు ఆయన అంటే గిట్టని వారు ఆయన మీద ఎన్నో విమర్శలు చేస్తున్నారు.
ఆయన పార్టీ కోసం ఎంతో పని చేస్తున్నారు. ఆయన మీద ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ ఆయన అన్నీ భరిస్తూ, ఓపికగా పార్టీ పనులలో నిమగ్నమయ్యారు. జనసేన పార్టీలో కుల రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితులలో ఊరుకోను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
జనసేన పార్టీలో మిత్రులుగా పక్కనే ఉండి, శత్రువులకు తగ్గ ఆలోచన చేసి పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తే మాత్రం ఊరుకునేది లేదు. భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసే మనోహర్ గారిని గాని, జిల్లా నాయకులు, కార్యకర్తలు గాని ఎవరినైనా ఈ రకంగా టార్గెట్ చేస్తే మాత్రం పార్టీ వారిని క్షమించదు. అలాంటి వారి పైన పార్టీ క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది. అలాంటి వ్యక్తిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయడానికి కూడా మేము ఎట్టి పరిస్థితులలో వెనకాడము.
పార్టీకి కానీ, వ్యక్తిగతంగా నాకు కానీ అనుకూల శత్రువులు అవసరం లేదు. అలాంటి వారిని పార్టీ ఎప్పుడు దూరంగానే ఉంచుతుంది. ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలనుకునే వారు పార్టీలో కొనసాగుతారు. వాస్తవానికి మనోహర్ గారు ఇప్పటివరకు ఏ నిర్ణయం సొంతగా తీసుకోలేదు. నన్ను సంప్రదించంది ఆయన ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అని మనోహర్ గారి గురించి పవన్ కళ్యాణ్ వివరించారు.
మనోహర్ గారు ఎంతో అనుభవజ్ఞులు, ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి ,ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఆయనకు ఇన్నీ విమర్శలన్నీ భరించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు, వేదన చూసి వారికోసం పనిచేయాలని ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తి. ఆయనకు పార్టీ ఎటువంటి పదవులు కానీ, డబ్బులు కానీ, ఎర చూపలేదు.
కానీ మా కోసం ఆయన ఓడిపోయినప్పటికి, ఆయన పార్టీ కోసం బలంగా నిలబడ్డారు. ఎన్నో అవమానాలు భరించారు. అలాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ విమర్శలు చేయడం సమంజసం కాదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చి, పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా కోవర్ట్ లాగా వ్యవహరించే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటుంది.
మనోహర్ గారి మీద తప్పుడు ప్రచారం చేసేవారు ముందుకు వస్తే నేను మీడియా ముఖంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను వచ్చి మాట్లాడవచ్చు .అని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు. ఒకవేళ అవి తప్పుడు ప్రచారాలని తెలితే మాత్రం వారి పైన కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా హెచ్చరించారు.