Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజల ముందుకు రాబోతున్నాడు అనే విషయం అందరికీ విధితమే. అయితే ఈ వారాహి యాత్రకు బుధవారం రోజు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శనం చేసుకొని ప్రజా క్షేత్రంలోకి వస్తారు. వారాహి నుంచి తొలి బహిరంగ సభను ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో ఆయన నిర్వహించనున్నారు.
పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం ఇవ్వబోయే మొట్టమొదటి గ్రామం కత్తిపూడి కానుంది ఇప్పటివరకు అన్నవరం కత్తిపూడి ప్రాంతంలో నాయకులు జన శ్రేణులు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశారు. కత్తిపూడి నుంచి వారాహి విజయ యాత్ర ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుతుంది.
ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా వివిధ సమస్యలతో సతమతమవుతూ కష్టాలుపడుతున్న ప్రజల బాధలు పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుసుకోబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ‘జనవాణి’ కార్యక్రమం చేపడతారు. ప్రజలు ఇచ్చే విజ్ఞాపనలు స్వీకరిస్తారు.
వాటిని పరిశీలించి సంబంధిత శాఖలకు ప్రజల ఇబ్బందులు, సమస్యలు తెలియచేసి పరిష్కారం కోసం పార్టీ పక్షాన ముందుకు వెళ్లాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ నాయకులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో వారాహి యాత్ర, అనంతరం సభ నిర్వహిస్తారు. వారాహి నుంచి పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నాడు. ఈ క్రమంలో యాత్ర దిగ్విజయానికి వివిధ కమిటీలు సమన్వయం చేశారు. 14వ తేదీ నుంచి మొదలయ్యే యాత్రను దిగ్విజయం చేసేందుకు వివిధ కమిటీలను నియమించారు.
పార్టీ రాజకీయ, వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు, నాయకులతో పలు దఫాలు చర్చించి దిశానిర్దేశం చేసి. ఏడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నాయకులు, శ్రేణులు, వీర మహిళలు, ప్రజలను సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగేలా ఈ కమిటీలు పని చేస్తాయి. వారాహి సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మెడికల్ టీం కూడా పని చేస్తుంది.