Pawan Kalyan : పవన్ కళ్యాణ్, వైసీపీ మంత్రుల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
అందరి మాటలను ఖండిస్తూ.. తమ పార్టీ నాయకుడు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదని, తెలంగాణ ప్రజలకు మద్దతు ఇస్తూ మాట్లాడారని, రాజకీయాల కోసం ప్రజలను మధ్యలోకి లాగి,వారిని కించపరిచే విధంగా మాటలు ఉండకూడదని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసారని జనసేన నాయకులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకులు మరో విధంగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని అవమానించేలా తెలంగాణ నాయకులు మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడు. అప్పుడు ఎందుకు స్పందించలేదు. అని అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ తీరుపై ధ్వజమెత్తారు.
BRS పార్టీతో అంతర్గతంగా ఒప్పందాలు చేసుకునే, ఈరోజు పవన్ కళ్యాణ్ brs కి మద్దతుగా మాట్లాడుతున్నాడని, దీనిని బట్టి చూస్తే ఆ పార్టీతో 1000 కోట్లు డీల్ పవన్ చేసుకున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు నిజమే కావచ్చు అని అనుమానాలు వ్యక్తం చేసారు.
అందరి మాటలకు రాజకీయ విశ్లేషకులు తాళం వేసారు. పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు అర్థం చేసుకోవడం ఎవరి వల్లా కావట్లేదు. పవన్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి గా రూపాంతరం చెందాడని, ఎప్పుడు ఏం మాట్లాడాలో లెక్కలు వేసుకొని మరీ మాట్లాడుతున్నాడని.చాలా పరిణితి చెందిన నాయకుడిలా పవన్ ఆలోచిస్తున్నాడని, బలమైన వ్యూహాలతోనే ఈ రకంగా మాట్లాడాడంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఒక్క స్టేట్ మెంట్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త అనుమానాలు,అలజడులు సృష్టించి,అధికార పార్టీ గుండెల్లో హడల్ పుట్టించాడు. పవన్ రాజకీయాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు అందరికి కష్టమైన పని అయింది.
