Pawan Kalyan Questions to YCP : వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వాలంటీర్ వ్యవస్థ పై తాను వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తుందని ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అనే సమాంతర వ్యవస్థను నడుపుతూ ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి ఏం చేస్తోంది..? ఎవరికి ఇస్తోంది..? – అనేది నా ప్రాధమిక ప్రశ్న. ఆ డేటా పక్కదారి పడితే ఏ జరుగుతుంది అనేది నా ఆవేదన.
వాలంటీర్ల పేరుతో సమాంతర వ్యవస్థ నడుపుతున్న వ్యక్తి నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, నన్ను విచారణ చేయడానికి నోటీసులు, జీవోలు పంపితే బెదిరిపోయేవాడిని. కాదు. మరిన్ని ప్రశ్నలు ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ఇక నుంచి ఇంకా బలమైన ప్రశ్నలు మీకు రాబోతున్నాయి అని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మీ అక్రమ మైనింగ్ మీద, మీ దోపిడీల మీద, మీ విధానాల మీద నేను ప్రశ్నిస్తూనే ఉంటాను.

తప్పు ఎక్కడ జరిగిందో ఎత్తి చూపుతూనే ఉంటాను. న్యాయం కోసం మాట్లాడితే నోటీసులు వస్తున్నాయి. హత్యలు చేసిన వారిని ఎలా కాపాడుతున్నారో చూస్తూనే ఉన్నాం అని వైసీపీ ప్రభుత్వ తీరును పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. వాలంటీరు వ్యవస్థకు జవాబుదారీ ఎవరు..?ఎనిమిదేళ్ళ పసిపాపపై అత్యాచారం చేసిన వాలంటీరు దుశ్చర్యను ఎవరికి చెప్పుకోవాలి…? ఇంట్లోనే నాటు సారా కానీ వాలంటీరు నేరాన్ని ఎవరితో మొరపెట్టుకోవాలి..?
ఏ వ్యవస్థకు అయినా జవాబుదారీతనం ఉంటుంది. ఈ వాలంటీరు వ్యవస్థకు జవాబుదారి ఎవరు..?.. వాలంటీర్లు చేసే తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా లేక ఎమ్మెల్యేలా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. లేదంటే వైసీపీ నాయకులు బాధ్యత వహిస్తారా అనేది ప్రజలకు వివరించాలి. అసలు జవాబుదారీతనం లేని వ్యవస్థను ఎందుకు తయారు చేశారో వివరించాలి.
రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థకు, లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందించే సంస్థ భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు అధ్యక్షులుగా ఉంటాడు. మరి ఇంటింటికి వచ్చి కీలకమైన వ్యక్తిగత డేటాను తీసుకెళ్తున్న వాలంటీర్లకు ఎవరు జవాబుదారి అని నేను అడిగాను..? దానిలో తప్పేముంది..? దీనికి సమాదానం చెప్పాలి అని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ నిలదీసారు.
