Pawan Kalyan Rare Photo : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సినిమా షూటింగుల్లో తీరికలేని షెడ్యూల్ గడుపుతున్నాడు. పవన్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో ది ఓజీలో నటిస్తుండగా వినోదాయ సీతమ్ కు రిమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దీన్ని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే భీమ్లా నాయక్ తర్వాత పవన్ సినిమాలేవి రిలీజ్ కాలేదు. దీంతో చాలాకాలంగా పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటో పంజా సినిమా షూటింగ్ సమయంలో తీసినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో ఈ ఫోటో తెగ వైరల్ అయ్యింది.
అందులో పవన్ కళ్యాణ్ ముందు తన కుమారుడు అకీరా నందన్ క్రికెట్ ఆడుతూ కనిపించాడు. వెనకాలే పవన్ తనయుడిని చూస్తూ ఎంతో మురిసిపోతూ చిన్నగా చిరునవ్వుతూ కనిపిస్తున్నాడు. చాలాకాలం తర్వాత పవన్, అకీరా ఇద్దరినీ అలా సంతోషంగా చూడడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరోవైపు తెరవెనుక అకీరా ఫిల్మ్ ఎంట్రీ కోసం గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది మెగా ఫ్యామిలీ. చూడాలి అకీరా ఎప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెడతాడో..