Pawan Kalyan – VijayaYathra : విశాఖపట్నం వారాహి విజయయాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. జగన్ అనే వ్యక్తి నాయకుడు కాదు… అతనో వ్యాపారి మాత్రమే. కమీషన్లు తీసుకొనే తరహా. ఎవరైనా పరిశ్రమ స్థాపించాలని వస్తే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అని జగన్ అడగడు… నాకేంటి అంటాడు. 30 శాతం ఇస్తావా 40 శాతం ఇస్తావా అని వాటాలు, కమీషన్లు ‘అడిగే వ్యాపారి అతను’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు.
గురువారం రాత్రి విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో వారాహి విజయ యాత్ర సభను నిర్వహించారు. పోలీసులు పలు ఆంక్షలు విధించి, జనసేన శ్రేణులను, ప్రజలను సభా స్థలికి రాకుండా అడ్డుకున్నా అశేష సంఖ్యలో జనం హాజరై పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. వారాహి నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ ..గతంలో గంధపు చెక్కల దొంగ వీరప్పన్ ఉండేవాడు. గంధపు చెట్లను నరికించేందుకు శీలన చేసుకొని వారితో చెట్లను కొట్టించేవాడు.
తను మాత్రం పై నుంచి అంతా పర్యవేక్షించేవాడు. వీరప్పన్ మాదిరిగా జగన్ తయారయ్యాడు. తప్పులను అధికారులతో, వాలంటీర్లతో, అనుచరులతో చేయిస్తూ పైన తన లబ్ధి పొందుతాడు. ఇదే జగన్ మార్కు పద్ధతి విధానం. జగన్ కి డబ్బు సంపాదన అనేది ఒక పిచ్చి. ఓ మనిషికి డబ్బు అనేది మొదట ఆశ, బాగా సంపాదించాలి…. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
సాధ్యమైనంత పొదుపు చేసి, భవిష్యత్తు తరాలకు ఉండాలి అనుకుంటారు. అది తర్వాత అలవాటుగా మారుతుంది. డబ్బు సంపాదించడం అలవాటుగా మారితే డబ్బు సంపాదించడమే వ్యాపకం అయిపోతుంది. అది జీవితంగా మారుతుంది.. ఆ స్టేజీ కూడా దాటి డబ్బు సంపాదించడం వ్యసనం కింద మారితే మాత్రం ప్రమాదకరం. డబ్బు సంపాదన కోసం ఇతరుల్ని పీడించడం, వేధించడం మొదలు అవుతుంది. డబ్బు వస్తుంది అంటే దేనికైనా తెగించడానికి సిద్ధపడతారు.
జగన్ ఈ స్టేజీలన్నీ ఎప్పుడో దాటేశారు. జగన్ కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో. కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన్న మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.