జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే కోనసీమలో బలం గా ఉన్న ఆ పార్టీ ఉత్తరాంధ్ర లోనూ తన బలాన్ని పుంజుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది.
దీనిలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా మరి కొద్ది సేపట్లో (మధ్యాహ్నం 3:30) విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంకి చేరుకోనున్నారు.
అక్కడ నుండి ఆయన RK బీచ్ రోడ్ లో ఉన్న నోవొటెల్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్న మెగా బ్రదర్ నాగబాబు మూడు రోజుల పాటు విశాఖపట్నంలో ఉండి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తారు.