Pawan Kalyan With Amit Shah : పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన విషయం విధితమే. పవన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు నుంచి అందరూ కూడా జనసేన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి బిజెపితో చర్చల కోసమే అని అభిప్రాయపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్డిఏ సమావేశం కోసమే ఢిల్లీ వెళ్లానని చెప్పుకొచ్చారు.. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగింది అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపద్యంలో నే ఎన్డీయే సమావేశం అనంతరం.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశమయ్యారు.

బుధవారం రాత్రి ఢిల్లీలోని హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సుమారు 25 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్తమాన రాజకీయ అంశాలతోపాటు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించారు.
ఈ సమావేశంపై పవన్ కళ్యాణ్ గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు అమిత్ షా గారితో జరిగిన చర్చలు దోహదపడతాయి అన్నారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
