OG Movie: పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆమాత్రం ఉంటుది.. రోజురోజుకి ‘ఓజీ’పై పెరుగుతున్న మాస్ హైప్
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’ మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ‘ఫైర్ స్టార్మ్’ పాట, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్లను మరింత వేగవంతం చేశారు.
సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘ఓజీ’ టీమ్ నాలుగు వేర్వేరు వెర్షన్లలో ట్రైలర్ కట్ చేసిందని, అందులో ఏది ఫైనల్ చేస్తారనే దానిపై క్లారిటీ లేదని సమాచారం. అయితే, ఈ ట్రైలర్లు అన్నీ రెండు నిమిషాల నిడివిలోనే ఉండనున్నాయి. సెప్టెంబర్ 18న ఈ ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో పాటు, తమన్ అందించిన పవర్ ఫుల్ బీజీఎం ఈ ట్రైలర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తాయని అంచనా వేస్తున్నారు.
ప్రమోషన్ల షెడ్యూల్‌ను మరింత బిజీగా మార్చుకుంటూ, సెప్టెంబర్ 15న ‘గన్స్ అండ్ రోసెస్’ అనే మాస్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 19న అడ్వాన్స్ బుకింగ్స్‌ను ప్రారంభించి, సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ సినిమాకు అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. టికెట్లకు భారీ డిమాండ్ ఉండడం చూస్తుంటే, సినిమాకు ఉన్న క్రేజ్ అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ పాన్-ఇండియా ఫాలోయింగ్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా.. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా మరోసారి రుజువయ్యింది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది. రిలీజ్‌కు ఇంకా రెండు వారాల సమయం ఉన్నప్పటికీ, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా $1.25 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
