భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయనని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, పోలీసుల దుందుడుకు చర్యగా భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ పైన, బిజెపి నాయకులు పైన పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిస్తోంది అని ఆయన పేర్కొన్నారు..
ఉద్రిక్తతలకు తావిచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారనీ.. ఎన్నికల నియమావళిని, నిబంధనలు అన్ని పార్టీలకు ఒకేలా వర్తింప చేయాలి అనీ.. పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వెళ్లడం గర్హనీయం అంటూ బండి సంజయ్ అరెస్టుని జనసేన పార్టీ తరపున ఖండిస్తూ ఒక లేఖ విడుదల చేశారు.
