పవన్ కళ్యాణ్..!! రాజకీయాల్లో అయినా.. సినిమాల్లో అయినా.. అందరి చూపూ అతని వైపే.. అతను ఏం చేసినా సన్సేషనే.. తాజాగా అయన వేసుకున్న షూస్ గురించి ఇపుడు నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది.. ఆ షూస్ కొన్న డబ్బుతో ఒకడు ఇల్లు కొనేయొచ్చు అనీ.. ఒకడు లైఫ్ సెట్ అయి పోద్ది అనీ.. ఇలా రకరకాలు గా.. మరి నిజానికి ఆ షూస్ ఖరీదు అంత ఉంటుందా..? అంటే..
వాస్తవానికి ఆ షూస్ 9,600 రూపాయలే.. మరి మధ్యలో ఈ పది లక్షలు ఎక్కడి నుండి వచ్చింది అంటే దాని price యూరో లలో ఉండడమే.. మనం డెసిమల్స్ వ్రాయడానికి పిరియడ్ (.) వాడినట్టు వాళ్ళు యూరోస్ కి కామా (,) వాడతారు.. అసలు ఆ షూ ఖరీదు €119.94 అంటే 9,600 రూపాయలు.. కానీ అక్కడ వెబ్సైట్ లో €119,94 అని కనబడే సరికి దాన్ని 11,994 యూరోలు అనుకుని పవన్ షూస్ ఖరీదు పది లక్షలు అని ప్రచారం చేస్తున్నారు గానీ నిజానికి అవి 9,600 రూపాయలు మాత్రమే..
