Peddi: రామ్ చరణ్ ప్రొఫెషనలిజం చూసి ఆశ్చర్యపోయా.. అంటున్న జాన్వీ
Peddi: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈమె, తాజాగా రామ్ చరణ్ – బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా గురించి, దర్శకుడు బుచ్చిబాబు మరియు హీరో రామ్ చరణ్‌పై కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
“బుచ్చిబాబు గారితో పని చేయడం నా అదృష్టం. ఆయన ‘ఉప్పెన’ వంటి హృదయాన్ని హత్తుకునే సినిమా తీశారు. ‘పెద్ది’ సినిమాలో నేను ఒక సాధారణ హీరోయిన్ పాత్రలో కాకుండా, చాలా భిన్నమైన, ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నాను. ఈ పాత్ర నా కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రేక్షకులు కచ్చితంగా నా పాత్రను ఆస్వాదిస్తారు,” అని జాన్వీ కపూర్ అన్నారు.
అలాగే, హీరో రామ్ చరణ్‌పై కూడా జాన్వీ ప్రశంసల వర్షం కురిపించారు. “రామ్ చరణ్ సర్ నా ఫేవరెట్ నటుడు. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, సెట్‌లో ఒక విద్యార్థిలా ఉండటం, ఆయన కష్టపడే తత్వం, అంకితభావం నన్ను ఆశ్చర్యపరిచాయి. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. మళ్లీ ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటానా అని ఎదురుచూస్తున్నాను,” అని జాన్వీ తెలిపారు.
‘పెద్ది’ సినిమాతో తెలుగులో తన నటి జీవితం మరింత ముందుకు వెళ్తుందని జాన్వీ ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మధ్యే రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ టీమ్ ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. “మా ‘పెద్ది’ 18 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం. తెరపై ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూనే బయట ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండటమే కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నారు. మాకు ఎన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలను ఇచ్చాడు. ‘పెద్ది’ సినిమా నుంచి చాలా పెద్ద సర్‌ప్రైజ్‌లు మొదలు కాబోతున్నాయి” అని చిత్ర బృందం పేర్కొంది.