Plants : చెట్లకు జీవం ఉంటుందని మనకు తెలుసు. అలాగే అదే చెట్లకు జీవంతో పాటు, స్పర్శ గుణం కూడా ఉంటుందని అధ్యయనాల్లో వెళ్లడైంది. చెట్లలోపల స్పర్శ ఆరంభమైనప్పుడు, తిరిగి ఆగిపోయినప్పుడు మొక్కలు వేరువేరుగా స్పందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మొక్కలకు నరాలు లేకపోయినా కూడా మనం వాటిని తాకినప్పుడు అవి ప్రతిస్పందనను కదలిక
రూపంలో తెలియజేస్తాయని నిపుణులు వెల్లడించారు. ఎక్స్పరిమెంట్ చేస్తున్న సమయంలో ప్లాంట్ సెల్స్ ఇతర ప్లాంట్ సెల్స్ కి మధ్య కాల్షియం సిగ్నల్స్ వేవ్ ను మెల్లిగా పంపడం వల్ల గ్లాస్ రాడ్ స్పర్శకు మొక్కలు ప్రతిస్పందించాయని మా అధ్యయనాల్లో తేలింది అని శాస్త్రవేత్తలు తెలిపారు. మొక్కలను ముట్టుకున్నప్పుడు ప్రెషర్ రిలీజ్ అవ్వడం వల్ల అవి మరింత వేగంగా తరంగాలను
పంపుతాయని, మొక్కలకు స్పర్శగుణం ఉందని ముందుగానే సైంటిస్టులకు తెలుసును కానీ.. మొక్కల్లో స్పర్శా ప్రారంభమైనప్పుడు, ముగిసినప్పుడు మొక్కల కణాలు వేరువేరు సంకేతాలను పంపుతాయనేది మాత్రము తాజా అధ్యయనాల్లో వెల్లడైందని వారు తెలిపారు. మొక్కల్లో జంతువుల కంటే భిన్నమైన రీతిలో
నరాలు లేకపోయినప్పటికీ, చక్కగా ప్రతిస్పందించడం, ప్లాంట్ సెల్స్ చాలా సెన్సిటివ్ గా ఉండడము, ప్రెషర్ ను మొక్కలు గ్రహించడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని పరిశోధకులు తెలిపారు. మనుషుల్లో లేక జంతువుల్లో ఆర్గాన్ సెల్స్ స్పర్శ ద్వారా తెలుస్తుంది అయితే మొక్కల్లో మాత్రం ప్లాంట్ సెల్స్ బలమైన సెల్యులార్ వాల్స్ కలిగి ఉండడమే గాక ఫ్లూయిడ్ పొరలతో ఉంటాయి.
ఇవి తేలికపాటి స్పర్శ కూడా మొక్క కణంలో ఒత్తిడిని తాత్కాలికంగా పెంచుతుందని అలాగే మొక్కల్లో మెకానిజం ఇంటర్నల్, కణాలపీడన పెరుగుదల ,తగ్గుదల కూడా సాధ్యమవుతుందని నిపుణులు వెల్లడించారు. భవిష్యత్తులో సిగ్నల్స్ వివిధ మార్గాల్లో ప్రేరేపించడం ద్వారా మొక్కల్లో కలిగే స్పర్శ, భావాలు ఎలా ఉంటాయో.. మరింత అధ్యయనం చేసి తెలుసుకుంటామని వారు వెల్లడించారు.
.