Plastic Water Bottles : వేసవిలో దాహం ఎక్కువగా వేయడం సర్వసాధారణం. ఇంట్లో ఉన్నప్పుడు గ్లాసులల్లో నీళ్లు తాగుతాం. కానీ బయటకు వెళ్ళినప్పుడు ప్రత్యామ్నాయంగా బాటిల్లో నీళ్లు తాగేస్తుంటాం. కానీ ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగడం చాలా ప్రమాదకరం. ఎండాకాలంలో ప్లాస్టిక్ బాటిల్ వాడటం ఇంకా ప్రమాదకరం. చాలామంది ఒక్కసారికి బాటిల్లో నీళ్లు తాగితే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటారు. కానీ ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లు తాగకూడదు.
పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే..
* ప్లాస్టిక్ బాటిల్స్ పైన ఎండ పడితే అవి మైక్రో ప్లాస్టిక్ ను విడుదల చేస్తాయి. అలాంటి నీటిని మనం తాగితే శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను రక్షించే ఎండోక్రైన్ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి నీటిని తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
* ప్లాస్టిక్ బాటిల్ నుండి డయాక్సిన్ లాంటి ట్యాక్సీన్ నీటిలోకి విడుదలవుతుంది. ఈ డయాక్సిన్ నీటిని తాగితే బ్రేస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మగవారిలో అయితే శుక్రకణాల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయి.
* ఈ ప్లాస్టిక్ నీళ్లు రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. ప్లాస్టిక్ కలిపిన నీటిని తాగడం వల్ల పొత్తికడుపు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి.
* ఈ నీళ్ల వల్ల ఓవరియన్ సమస్యలు, పిసిఒఎస్, హార్మోన్ల అసమతుల్యం, కోలాన్ కాన్సర్, ప్రోస్టేజ్ క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
* కొంతమంది బయటకు వెళ్లినప్పుడు వన్ టైం యూజ్ ప్లాస్టిక్ బాటిల్ ని కొంటారు. ఆ బాటిల్లో నీళ్లు తాగేసి మళ్ళీ అదే బాటిల్ ని తీసుకొచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూడా వాడుతుంటారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. బయటికి వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా మెటల్ బాటిల్ గాని గ్లాస్ గాని వాడడం మంచిది.